ETV Bharat / state

'మేము చనిపోయినా పట్టించుకునేవారు లేరు' - తమిళనాడులో చిక్కుకుపోయిన ప్రకాశం జిల్లా కూలీలు

ఉపాధి కోసం తమిళనాడుకు వెళ్లిన ప్రకాశం జిల్లాకు చెందిన కూలీలు లాక్​డౌన్​తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉండేందుకు సరైన సదుపాయాలు లేక కష్టాలు పడుతున్నారు. అధికారులు తమను పట్టించుకోలేదని వారు వాపోతున్నారు.

Sugarcane farming labors from Andhra struck in tamilnadu

author img

By

Published : May 30, 2020, 7:10 PM IST

వలస కూలీల ఆవేదన

ప్రకాశం జిల్లాకు చెందిన 21 మంది వలస కూలీలు తమిళనాడులో అవస్థలు పడుతున్నారు. తినడానికి తిండి, ఉండడానికి సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకాశం జిల్లాకు చెందిన సుమారు 200 మంది వలస కూలీలు తమిళనాడు పుదుకొట్టై జిల్లా అరంగతంగిలోని ఓ చక్కెర కర్మాగారంలో పని చేసేందుకు వెళ్లారు. వీరిలో చాలామంది ఒక నెలలోపు తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోయారు. 21 మంది మాత్రం పనికోసం అక్కడే ఉన్నారు. మార్చి చివర్లో లాక్​డౌన్ విధించటంతో చిక్కుకుపోయారు.

వారందరూ ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో ఉంటున్నారు. ప్రభుత్వాలు తమకు ఏ మాత్రం సాయం అందించటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము చనిపోయిన పట్టించుకునేవారు లేరని కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై ఈటీవీ భారత్​ ప్రతినిధి పుదుకొట్టై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా... కొన్ని రోజుల్లో వారందరినీ స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి

'వైకాపా ఏడాది పాలనలో ఏమున్నది గర్వకారణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.