ETV Bharat / state

Districts Agitation: నూతన జిల్లాల కోసం..ఆగని ఆందోళనలు - districts agitation

Districts Agitation: కొత్త జిల్లాల ఏర్పాటుపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ ప్రాంతాలను నూతన జిల్లాలుగా ప్రకటించాలని ఆందోళనలు చేపడుతున్నారు.

Districts Agitation
నూతన జిల్లాలు ఏర్పాటు చేయాలంటూ నిరసనలు...
author img

By

Published : Feb 23, 2022, 1:34 PM IST

Districts Agitation: ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్రియ కొనసాగిస్తుండగా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మా ప్రాంతాలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని కొన్నిచోట్ల ఆందోళనలు కొనసాగుతుండగా.. మరికొన్ని ప్రాంతాలను వేరే జిల్లాలో కలపాలని నిరసనలు చేపడుతున్నారు.

ప్రకాశం జిల్లాలో...

మార్కాపురాన్ని నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిరసనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన రీలే నిరాహార దీక్ష నేటితో 15వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉన్న మార్కాపురాన్ని జిల్లా చేయాల్సిన అవసరం ఉందని వారన్నారు. ఈ దీక్షకు తెదేపా నాయకులు సంఘీభావం ప్రకటించారు.

కృష్ణాజిల్లాలో..

ప్రభుత్వం జిల్లాల విభజనలో అనాలోచిత నిర్ణయం వల్ల... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని.... తెలుగుదేశం నేత దేవినేని ఉమ మండిపడ్డారు. కొందరు అధికారులు ప్రమోషన్లు, పదవులకు ఆశపడి ముఖ్యమంత్రికి తప్పుడు సలహాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. మైలవరం రెవెన్యూ డివిజన్‌ చేయాలని విజయవాడ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో దేవినేని ఉమా వినతిపత్రం అందించారు.

ఇదీ చదవండి :

New Districts: జిల్లాల పునర్విభజన అంశంపై ప్రణాళిక శాఖ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.