రాయవరంలో రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీలు - రాష్ట్ర స్థాయి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలో వెలసిన శ్రీ అలివేలుమంగా సమేత వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజున రాష్ట్రస్థాయి ఎద్దుల బల ప్రదర్శన నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన 18 జతల ఎద్దులు పాల్గొన్నాయి. పోటీలను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.
యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం రైల్వే స్టేషన్ లో వెలిసిన శ్రీ అలివేలుమంగా సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి 18 జతల ఎడ్లు పాల్గొన్నాయి. పెద్ద సైజు పోటీల్లో ఎడ్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. ఈ పోటీలను వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మొదటి నుండి 5 వరకు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.