ETV Bharat / state

'రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ పంపిణీకి చర్యలు'

author img

By

Published : Dec 9, 2020, 4:28 PM IST

రాష్ట్రంలో నివర్‌ తుపానుతో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో నివర్‌ తుపానులో నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు ఆయన జిల్లాలో పర్యటిస్తున్నారు.

'రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ పంపిణీ చేసేందుకు చర్యలు'

నివర్ తుపానుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ అన్నారు. ఒంగోలు మార్కెట్‌ యార్డులో నిర్మిస్తున్న ప్రయోగశాలను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో ప్రాథమిక అంచనా ప్రకారం 6.5లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని, అందులో అత్యధికంగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే ఉన్నాయన్నారు. ఇందులో 70 వేల హెక్టార్లలో ఇన్‌పుట్‌ సబ్సిడీకి అర్హత ఉన్న పంటలుగా గుర్తించామని అరుణ్ కుమార్ తెలిపారు. 33 శాతం పంట నష్టపోయిన వారిని గుర్తించి వారికి ఎకరాకు 10 వేల రూపాయలు చొప్పున చెల్లిస్తామన్నారు. గరిష్టంగా 5 ఎకరాలు, లేదా 30 వేల రూపాయల చొప్పున రైతుకు చెల్లించే విధంగా మార్గదర్శకాలు విడుదల చేశామన్నారు.

2019 సంవత్సరం ఖరీఫ్‌లో నష్టపోయిన వారికి బీమా చెల్లింపులు.. 7.5 లక్షల మంది రైతులకు ఈనెల 15 లోపు చెల్లిస్తామని వ్యవసాయ శాఖ కమిషనర్ చెప్పారు. ఈ మేరకు 1280 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందిస్తామన్నారు. ఈ క్రాప్‌లో పేర్లు నమోదు చేసుకోలేనివారికి కూడా వెబ్‌సైట్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చామని, ఇప్పుడు ఇలాంటివారు తమ పేర్లను ఈ క్రాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా వాస్తవ సాగుదారులు(కౌలు రైతులు) కోసం ఈ ఆప్షన్‌ అందుబాటులోకి తీసుకువచ్చామని కమిషనర్‌ అరుణ్ ‌కుమార్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సాగు చట్టాలపై రైతు సంఘాలకు కేంద్రం లేఖ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.