ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి గెలుపొందిన బాలినేని శ్రీనివాసరెడ్డిని మరోసారి మంత్రి పదవి వరించింది. 1999, 2004, 2009, 2012, 2019లో ఆయన ఒంగోలు స్థానం నుంచి విజయం సాధించారు. రాజశేఖరరెడ్డి హయాంలో భూగర్భ, ఖనిజ, చేనేత జౌళి శాఖలు నిర్వహించిన బాలినేని... 2012లో వైకాపా తరపున పోటీ చేసి గెలుపొందారు. అనుభవం, వివాద రహితుడు, మృదుస్వభావి కావడం ఆయనకు కలిసొచ్చింది.
బాలినేని శ్రీనివాసరెడ్డి
నియోజకవర్గం: ఒంగోలు
వయస్సు: 55
విద్యార్హత: ఇంటర్మీడియెట్
రాజకీయ అనుభవం: ఐదుసార్లు ఎమ్మెల్యే, వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు.
యర్రగొండపాలెం నుంచి గెలుపొందిన ఆదిమూలపు సురేశ్ జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. రాజశేఖర రెడ్డి అనుయాయుడిగా, విద్యావేత్తగా పేరున్న సురేశ్... జగన్‌కు అత్యంత సన్నిహితుడు. 2009లో యర్రగొండపాలెం నుంచి గెలుపొందిన ఆదిమూలపు సురేశ్... 2014లో సంతనూతలపాడు నుంచి విజయం సాధించారు. 2019లో మళ్లీ యర్రగొండపాలెం నుంచి గెలుపొందారు.
ఆదిమూలపు సురేశ్
నియోజకవర్గం: ఎర్రగొండపాలెం
వయస్సు: 45
విద్యార్హత: ఐఆర్‌ఎస్
రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పీఏసీ సభ్యుడిగా, వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు.