ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సుజాత.. కొనకొనమిట్ల మండలం పెదారికట్ల వద్ద 50 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. పాలేకర్ స్ఫూర్తితో ఎక్కడా రసాయనాలు వినియోగించకుండా చేస్తున్న సాగులో వచ్చే ఉత్పత్తులను.. మధ్యవర్తులు, వ్యాపారులకు అమ్మకుండా, నేరుగా వినియోదారులకే విక్రయిస్తున్నారు. దీనికోసం సామాజిక మాధ్యమాలు వినియోగించుకుంటున్నారు.
ప్రకృతి విధానంలో చేస్తున్న వ్యవసాయ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉండటంతో.. వ్యాపారం పెద్ద కష్టం కావడంలేదు. విశ్వమాత ఫామ్స్ పేరుతో వెబ్‌సైట్, వాట్సాప్ గ్రూప్ ల ద్వారా వినియోగదారుకు నేరుగా వినియోగించడం వల్ల.. తమకూ ఆదాయం లభించడమే కాకుండా.. వినియోగదారుడికీ తక్కువ ధరకు ఉత్పత్తి చేరుతుందని సుజాత పేర్కొంటున్నారు.
సాంకేతకతతో లాభాలు..
సాగు, మార్కటింగ్ విషయాల్లో సాంకేతికంగా సుజాత భర్త కోటేశ్వరరావు సహకారం అందిస్తారు. పంట ఉత్పత్తులను శీతల గిడ్డంగుల్లో పెట్టుకొని అవసరాన్ని బట్టి విక్రయిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. అతి తక్కువ ఖర్చుతో సాగు చేస్తున్నామని, దిగుబడి తక్కువగా ఉన్నా.. ఆదాయం లాభసాటిగా ఉందని అంటున్నారు. సాంకేతకత వల్ల చాలావరకు ఖర్చులు తగ్గించుకొని... మార్కెట్ చేసుకుంటున్నామని కోటేశ్వరరావు పేర్కొంటున్నారు. ఆలోచన ఉండాలే కానీ.. వ్యవసాయం లాభసాటి అని నిరూపించేందుకే తాము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని వీరు అంటున్నారు. అలాగే రసాయనాలు లేని ఉత్పత్తులను అందిస్తూ.. ప్రజల ఆరోగ్యం కూడా కాపాడుతూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇదీ చదవండి:
Roads Damage: అడుగుకో గుంత.. చినుకుపాటుకు బురదమయం.. ఎలా ప్రయాణం?