ETV Bharat / state

గుర్తుల కేటాయింపుతో ప్రచారం ముమ్మరం..కరపత్రాల కోసం పడిగాపులు - panchayati election campaigning at prakasam

ప్రకాశం జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. తొలివిడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ తరువాత అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ప్రింటింగ్‌ ప్రెస్‌లను ఆశ్రయిస్తున్నారు.

గుర్తుల కేటాయింపుతో ముమ్మర ప్రచారం.
గుర్తుల కేటాయింపుతో ముమ్మర ప్రచారం.
author img

By

Published : Feb 5, 2021, 7:50 PM IST

ప్రకాశం జిల్లాలో తొలివిడతలో భాగంగా 14 మండలాల్లో 229 పంచాయతీలు, 2344 వార్డులకు ఎన్నికల నిర్వహణకు ఎస్​ఈసీ నోటిపికేషన్ జారీ చేసింది. దీంతో పలు పార్టీల మద్దతుతో అభ్యర్థులు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పలు పంచాయతీల సర్పంచ్, వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలో తొలివిడతలో దాదాపు 35 పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవం కావడంతో అక్కడ ఎన్నికలు జరగవు. అయితే వార్డు సభ్యులు పోటీ ఉన్నచోట మాత్రం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వార్డులపరంగా చూస్తే 830 ఏకగ్రీవం అయ్యాయి. దీంతో పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

గుర్తుల కేటాయింపులో....

అభ్యర్థుల.. కేటాయించిన గుర్తులను ప్రజల్లో తీసుకెళ్లేందుకు గతంలో మాదిరిగా గోడల మీద రాసే విధానం లేకపోవడంతో కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు తొలివిడత పోటీ అభ్యర్థుల తుది జాబితా వెలువడటంతో అభ్యర్థులు ప్రింటింగ్‌ ప్రెస్‌లకు పరుగులు తీశారు. రాత్రిపగలు అక్కడే పడిగాపులు కాస్తూ.. తమకు కేటాయించిన గుర్తులతో డమ్మీ బ్యాలెట్‌ పత్రాలను ముద్రిస్తున్నారు. ఎన్నికల సంఘం అభ్యర్థుల కోసం 25 గుర్తులను కేటాయించింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రింటింగ్‌ ప్రెస్‌లకు భారీగా డిమాండ్‌ పెరిగింది.

బ్యాలెట్‌ పత్రాలు ఇప్పటికే సిద్దం..

ఎన్నిక కమిషన్‌ పోలింగ్‌ నాటికి వినియోగించే బ్యాలెట్‌ పత్రాలు అధికారులు ఇప్పటికే సిద్దం చేశారు. జిల్లాలో దాదాపు 50లక్షల బ్యాలెట్‌ పత్రాలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఎస్​ఈసీ జోక్యం చేసుకున్నా పరిష్కారం కాలేదు.. ఎంటా సమస్య..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.