ETV Bharat / state

Murder: భార్యను కాపురానికి పంపలేదని.. అల్లుడు ఏం చేశాడంటే..! - murder for aunty not sending wife to husband house

తమ మధ్య మనస్పర్థలు ఉన్నా... అవన్నీ తొలగిపోయి భార్య కాపురానికి వస్తుందని భర్త భావించాడు.. ఎన్ని రోజులైనా రాకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. తన భార్య కాపురానికి రాకపోవడానికి ఆమే కారణమని భావించాడు. ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని చూశాడు. అదును కోసం ఎదురు చూసిన అల్లుడు.. అవకాశం రాగానే అత్తను కత్తితో పొడిచి హత్య చేశాడు.

murder
murder
author img

By

Published : Jul 1, 2022, 4:47 PM IST

Son-in-law killed his Aunty: భార్యను కాపురానికి పంపడం లేదంటూ.. ప్రకాశం జిల్లాలో ఓ అల్లుడు అత్తను చంపేశాడు. దర్శి మండలం బొట్లపాలేనికి చెందిన ఆదిలక్ష్మి.. తన కుమార్తె సుకన్యను.. చీమకుర్తికి చెందిన యల్లయ్యకు ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం జరిపించింది. మొదటి నుంచీ వారివద్ద మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి. పెద్దమనుషులు నచ్చజెప్పినా.. మళ్లీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదిలక్ష్మి అద్దంకిలో ఉండే తన పుట్టింటికి వెళ్లగా.. సుకన్య కూడా అక్కడికే వెళ్లింది. అత్త ఆదిలక్ష్మిపై పగ పెంచుకున్న యల్లయ్య.. ఆమెను చంపాలని పథకం వేశాడు. వితంతు పింఛన్‌ తీసుకునేందుకు.. గ్రామానికి వస్తుందని వేచి చూశాడు. వచ్చీ రాగానే అత్త వెనుకే ఇంట్లోకి వెళ్లిన అల్లుడు.. కత్తితో పొడవడంతో ఆదిలక్ష్మి అక్కడికక్కడే చనిపోయింది.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.