లాక్ డౌన్ తో ప్రజలు ఇళ్ళకే పరిమితమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ నేతలు అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలోని ఏఐటీయూసీ కార్యాలయంలో సీపీఐ నేత మేడ వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలకు అండగా నిలవాల్సిన సమయంలో కరెంటు బిల్లుల శ్లాబ్ రేట్ మార్చి.. ముప్పై రోజులకు తీయాల్సిన రీడింగ్ ను 60 రోజులకు తీస్తున్న కారణంగా ప్రజలపై మరింత ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని ప్రజలకు అండగా నిలిచి పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ చీరాల కార్యదర్శి బత్తుల శామ్యూల్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: