ETV Bharat / state

ఓటెత్తిన జనం..జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదు - ఏపీలో పంచాయతీ ఎన్నికలు

ప్రకాశం జిల్లాలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. తొలివిడత కన్నా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో అధిక శాతం ఓటింగ్‌ నమోదైంది. ప్రారంభంలో కొంత మందకొడిగా సాగినా... క్రమక్రమంగా ఓటింగ్‌ శాతం పెరిగింది. జిల్లావ్యాప్తంగా 14 మండలాల్లో 86.60 శాతం ఓట్లు పోలయ్యాయి. 208 పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌తో పాటు వెంటనే కౌంటింగ్‌ నిర్వహించి..ఫలితాలు విడుదల చేస్తున్నారు.

జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదు
జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదు
author img

By

Published : Feb 13, 2021, 9:37 PM IST

రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. జిల్లావ్యాప్తంగా 14 మండలాల్లో 86.60 శాతం ఓట్లు పోలయ్యాయి. 208 పంచాయతీల్లో 4.12 లక్షల ఓటర్లకు గానూ 3.57 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా ముండ్లమూరు మండలంలో 92.45 శాతం, పొదిలి 89 శాతం, తాళ్ళూరు 88.57 శాతం, అద్దంకి 88.38 శాతం పోలింగ్‌ నమోదైంది.

తొలివిడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 80.56 శాతం పోలింగ్ మాత్రమే నమోదు కాగా..రెండో విడత ఎక్కువమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు పెద్ద సంఖ్యలో ఉన్నా..ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు జరిగాయి.

ఇదీచదవండి

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.