ప్రకాశం జిల్లా గార్లపేటలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలు పట్టుబడ్డాయి. పొదిలి పరిధిలోని పలు ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి తరలించి.. ఈ మద్యాన్ని నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. 329 మద్యం సీసాలతో పాటు మరికొన్ని బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మద్యం నిల్వ ఉంచిన వ్యక్తితో పాటు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే మరో ముగ్గురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండీ.. చివరి అంకానికి చేరుకున్న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక