ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం రావినూతలలోని ఆర్ఎస్సీఏ క్రీడా మైదానంలో క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. సినీ నటుడు రఘుబాబు టాస్ వేసి పోటీలు ప్రారంభించారు. రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి 16 జట్లు తలపడుతున్నాయి. మొదటిరోజు ఒంగోలు, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది.
ఇవీ చూడండి: