ETV Bharat / state

'మాస్కులు, శానిటైజర్లు ఇవ్వట్లేదు...జీతాలూ ఆపేశారు' - ఏపీలో కరోనా కేసులు

కరోనా మహమ్మారిపై పోరులో పారిశుద్ధ్య కార్మికులది కీలక పాత్ర. ప్రజారోగ్యం కోసం వారి ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తుంటారు. లాక్​డౌన్​తో అందరూ ఇళ్లకే పరిమతమైనా వారు మాత్రం ప్రజా సేవ చేస్తున్నారు. అయితే వారి భద్రత విషయంలో మున్సిపాలిటీలు తగినంత శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రక్షణ సామగ్రి పంపిణీ చేయకపోగా... జీతాలు సైతం సక్రమంగా విడుదల చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Sanitary workers
Sanitary workers
author img

By

Published : Apr 8, 2020, 7:28 PM IST

'మాస్కులు, శానిటైజర్లు ఇవ్వట్లేదు...జీతాలూ ఆపేశారు'

కరోనా మహమ్మారి కలవరపెడుతున్నా సైనికుల్లా విధులు నిర్వహిస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు. వైరస్​కు వెన్నుచూపకుండా ఎప్పటిలాగే సేవలందిస్తున్నారు. అయితే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఈ కార్మికుల విషయంలో మాత్రం మున్సిపాలిటీలు తగిన శ్రద్ధ చూపడం లేదు. ప్రకాశం జిల్లాలో వీరి పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన కాలనీల్లో, రెడ్​జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లోనూ వీరు సేవలందిస్తుంటారు. ఇలాంటి కార్మికులకు అవసరమైన రక్షక కవచాలు సమకూర్చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారికిచ్చే చేతి గ్లౌజ్‌లు ఒకటి రెండు రోజులకే చిరిగిపోతున్నాయి. కాంట్రాక్టు కార్మికులకు వీటినీ సక్రమంగా ఇవ్వడంలేదు. మాస్క్​లు కూడా రెండు మాత్రమే ఇస్తున్నారని కార్మికులు చెబుతున్నారు. వీటినే ఉతుక్కొని వినియోగించుకోవాలని అధికారులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతులు శుభ్రపరుచుకోవడానికి శానిటైజర్లు, సబ్బులు, కొబ్బరి నూనెలు కూడా పంపిణీ చేయటం లేదని తెలిపారు.

ఆహారానికీ ఇబ్బందే...

పారిశుద్ధ్య కార్మికులు లాక్​డౌన్​తోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టు పక్కల పల్లెల్లో ఉండేవారు తెల్లారేసరికి పట్టణాలకు రావాలి. అయితే తమకు ఎలాంటి గుర్తింపు కార్డు గానీ, ఏకరూప దుస్తులు గానీ ఇవ్వకపోవడం వల్ల పోలీసులు అడ్డుకుంటున్నారని కాంట్రాక్టు కార్మికులు చెబుతున్నారు. హోటళ్లు మూసేయటంతో ఆహారం దొరకడం కష్టంగా మారిందని అంటున్నారు. వీటితోపాటు తమకు రెండు నెలలుగా జీతాలు రావటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వాలు అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు.

ఇదీ చదవండి: కరోనాపై పోరుకు కొత్త సైన్యం- ఆన్​లైన్​లో శిక్షణ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.