ప్రకాశం జిల్లా మార్కాపురం దరిమడుగు సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైయ్యాయి. గాయపడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆర్టీసీ డీఎం శ్రీకాంత్ పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి:బోటు డ్రైవర్ క్యాబిన్.. బయటికొచ్చింది!