Robbery: దుండగులు కారును ఆటకాయించి నగదును దోచుకెళ్లిన సంఘటన ప్రకాశం జిల్లా దోర్నాల మండలం యడవల్లి సమీపంలో చోటుచేసుకుంది. గుజరాత్ కు చెందిన ఇద్దరు కోల్కత్త నుంచి కర్ణాటకలోని హౌస్ పేటకు వెళ్తున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో దోర్నాల మండలం యడవల్లి వద్ద మరో కారులో వచ్చిన దుండగులు.. బెదిరించి కారును ఆపారు. పక్కనే ఉన్న బలిజెపల్లి రహదరిలోకి కారును మళ్లించి కొంతదూరం వెళ్లిన అనంతరం కారులోని నగదును దోచుకెళ్లారు. బాధితుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెద్ద మొత్తంలో నగదు దోపిడీకి గురై ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
ఇవీ చదవండి: