ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దరిమడుగు సమీపంలో ఓ ఆటో-కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడి అందులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన దరిమడుగు గ్రామానికి చెందిన కొందరు యువకులు వెంటనే క్షతగాత్రులను మరో ఆటోలో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీంతో గాయపడిన వారికి వెంటనే చికిత్స అందింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి వైద్యశాలకు తీసుకెళ్లిన యువకులను స్థానికులు, పోలీసులు అభినందించారు.
ఇదీ చదవండి