ETV Bharat / state

విశ్రాంత ఏఎస్ఐ హత్య కేసును ఛేదించిన పోలీసులు..నిందితుడు అరెస్టు - ప్రకాశం జిల్లా క్రైం

ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన విశ్రాంత ఏఎస్​ఐ హత్య కేసును ఈపురుపాలెం పోలీసుల ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కర్రను స్వాధీనం చేసుకున్నారు.

Retired ASI murder accused arrested in eepurupalem prakasam district
విశ్రాంత ఏఎస్ఐ హత్యకేసు నిందితుడు అరెస్టు
author img

By

Published : Aug 25, 2020, 5:04 PM IST

విశ్రాంత ఏఎస్ఐ హత్యకేసును ప్రకాశంజిల్లా ఈపురుపాలెం పోలీసులు ఛేదించారు. ఒంగోలుకు చెందిన విశ్రాంత ఏఎస్సై సూదనగుంట నాగేశ్వరరావు తోటవారిపాలెంలోని వీవర్సు కాలనీలో నివాసముంటున్నాడు. వీరి ఇంటికి సమీపంలో ఉండే సురేంద్రబాబుతో విభేదాలున్నాయి. వీటిని మనసులో ఉంచుకున్న సురేంద్రబాబు.. విశ్రాంత ఏఎస్సైపై కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కర్రను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: ఆధార్ ముఠా....ప్రభుత్వ పథకాల కోసం కార్డుల్లో మార్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.