ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా కోరలు చాచుతోంది. పట్టణంలో మరో 9 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో 80 కోవిడ్ కేసులు నిర్ధరణ అయ్యాయని అధికారులు తెలిపారు. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్, మెడికల్ దుకాణాలు సైతం రెడ్‌జోన్‌లోకి వెళ్లటంతో వాటిని మూసేశారు. జయంతిపేట, ఆనందపేట, విఠల్ నగర్, వైకుంఠపురం, అన్నదాతవీధి, హారీస్ పేట, శాంతి నగర్లలో 9 కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన అధికారులు ఆయా ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఒకటో పట్టణ ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు బారికేట్లు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి. విషాదం.. నీటికుంటలో పడి అక్కాతమ్ముడు మృతి