ETV Bharat / state

చీరాలలో రెబల్స్ హవా

చీరాలలో రెబల్స్ వైకాపాకు దడ పుట్టించారు. 33 స్థానాలకు గాను 11 చోట్ల పాగా వేశారు. వైకాపా 18 చోట్ల గెలిచి మునిసిపాలిటీని కైవసం చేసుకున్నప్పటికీ.. ముందు ముందు రెబల్స్ కీలకంగా మారనున్నారు.

v
చీరాలలో రెబల్స్ హవా..
author img

By

Published : Mar 14, 2021, 9:17 PM IST

Updated : Mar 14, 2021, 10:34 PM IST

ప్రకాశం చీరాల మున్సిపాలిటీలో రెబల్స్ హవా కొనసాగింది. అధికార వైకాపాకు వారు చెమటలు పట్టించారు. 33 స్థానాల్లో ఏకంగా 11 చోట్ల రెబల్స్ విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రెబల్స్​కు నేతృత్వం వహించారు. మొత్తం 30 స్థానాల్లో ఆమంచి వర్గీయులు పోటీ చేయగా.. 11మందిని విజయం వరించింది. వైకాపా 18 స్థానాల్లో గెలుపొంది మున్సిపాలిటీని దక్కించుకుంది. తెదేపా ఓ చోట విజయ సాధించింది.

ఆమంచిని కలిసిన రెబల్ అభ్యర్థులు..

చీరాల మున్సిపాలిటీలో గెలిచిన రెబల్ అభ్యర్థులు వైకాపా నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ ఆమంచి కృష్ణమోహన్​ను పందిళ్లపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. చీరాలలో వర్గ పోరు కారణంగా వైకాపకు రెబల్స్​ నుంచే గట్టిపోటీ ఎదురైంది.

ఇదీ చదవండి: ప్రకాశంలో ఫ్యాన్​ గాలి.. ఒంగోలు కార్పొరేషన్​పై వైకాపా జెండా

Last Updated : Mar 14, 2021, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.