ETV Bharat / state

రోజురోజుకు మితిమీరుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలు - ప్రకాశం జిల్లాలో రియల్​ ఎస్టేట్​ వ్యాపారం

Real estate irregularities: రోజురోజుకి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు వారి కబంద హస్తాలతో కబలిస్తున్నారు. ఆఖరికి ప్రజలకిచ్చిన ప్రభుత్వ భూమిని కూడా గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు చేస్తున్నారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన పట్టా భూములను, ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్న ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగింది. ఇంత జరుగుతున్నప్పటికీ అవేమీ మాకు పట్టవులే అన్నట్లుగా ప్రభుత్వ అధికారులు మాత్రం చూస్తూ ఉండిపోతున్నారు.

తమ పట్టాలను చూపుతున్న  లబ్ధిదారులు
తమ పట్టాలను చూపుతున్న లబ్ధిదారులు
author img

By

Published : Nov 19, 2022, 6:27 PM IST

పరిహారం కింద భూమిని పొందిన లబ్ధిదారులు

Real estate irregularities: ప్రకాశం జిల్లా కనిగిరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. వంకలు, వాగులే కాక ప్రభుత్వం పేదలకు ఇచ్చిన పట్టా భూములను, ప్లాట్లను కూడా గుట్టు చప్పుడు కాకుండా చదును చేసి ప్లాట్లుగా విభజించి విక్రయాలు జరుపుతూ అక్రమార్కులు జేబులు నింపుకొంటున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ అవేమీ మాకు పట్టవులే అన్నట్లుగా ప్రభుత్వ అధికారులు మాత్రం చూస్తూ ఉండిపోతున్నారు.

కనిగిరి పట్టణంలో గతంలో రోడ్ల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమంలో ఇళ్లను కోల్పోయిన బాధితులకు పరిహారంగా ప్రభుత్వం పొదిలి రోడ్డులో ప్లాట్లను కేటాయించి పట్టాలను జారీ చేసింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భూముల విలువలు పెరగడంతో ఆ ఫ్లాట్లపై అక్రమార్కుల కన్నుపడింది. గత రాత్రి గుట్టు చప్పుడు కాకుండా గతంలో ప్రభుత్వం వేసిన హద్దురాళ్ళను తొలగించి చదును చేశారు. ఇది గమనించిన లబ్ధిదారులు ఒక్కసారిగా తమ ప్లాట్ల వద్దకు చేరుకొని అక్రమార్కులపై వాగ్వాదానికి దిగారు. నష్టపరిహారం కింద ఇచ్చిన భూములను కబ్జా చేసేందుకు యత్నం చేస్తున్నారని... తమ పట్టాలను చూపుతూ ఆందోళన చేశారు. ఇదంతా మున్సిపల్‌ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి కాజేసే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.