ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని కొవిడ్ కేర్ సెంటర్ను ఆర్టీవో శేషిరెడ్డి పరిశీలించారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడం కోసం కొవిడ్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. కరోనా వ్యాప్తి పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్ నిర్ధారణ అయి ఇంట్లో ఉండడానికి అవకాశం లేని వారి కోసం ఈ కేంద్రాన్ని ప్రారంభించామని వివరించారు. రేపటి నుంచి కొవిడ్ సెంటర్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కొవిడ్ కేర్ సెంటర్లో ఉన్నవారికి ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం ఆల్పాహారము, భోజనం అందించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: చీరాల ఆసుపత్రిని పరిశీలించిన కొవిడ్ ప్రత్యేక నోడల్ అధికారి