ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ లబ్ధిదారులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. గత నెలలో అధిక ధరలకు పంచదార ఇచ్చారని... ప్రతి మనిషికి అందాల్సిన 5 కిలోల రేషన్ బియ్యం తగ్గించి ఇస్తున్నట్లు లబ్ధిదారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్డుదారుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ విచారణ చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
'రేషన్ సరఫరాలో అవకతవకలు నిర్మూలించండి' - ration not giving well
అద్దంకిలో రేషన్ సరఫరాలో అవకతవకలు జరిగాయని లబ్ధిదారులు తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.
ఫిర్యాదు చేస్తున్న లబ్ధిదారులు