ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం మొగళ్లూరు సమీపంలో రెండు వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 100 బస్తాల రేషన్ బియ్యాన్ని వెలిగండ్ల ఎస్సై రాజ్‌కుమార్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రెండు వాహనాలను పోలీస్‌స్టేషన్‌కి తరలించి.. నిందితులపై కేసు నమోదు చేశారు. బియ్యాన్ని అమ్మితే ఊరుకోమని…వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
ఇదీ చూడండి. ఆక్సిజన్ ప్లాంట్లు త్వరగా అందుబాటులోకి తీసుకురండి: హైకోర్టు