ETV Bharat / state

పెరిగిన సముద్రపు ఉప్పు ధరలు.. రైతుల్లో సంతోషం.. కానీ వ్యాపారులకు - Sea Salt Price From Farmers

Sea Salt Price: గతంతో పోలిస్తే రైతుల దగ్గర నుంచి సేకరించే సముద్రపు ఉప్పు ధర పెరిగింది. కొన్నిసార్లు ఈ ధర కోసం వేచి చూడాల్సి వస్తోందని రైతలు వాపోతున్నారు. అయితే రైతులకు అనుకూలంగా ఉన్న ధరలు.. వ్యాపారులకు మాత్రం ధరలు నిప్పు మీద ఉప్పులాగే చిటపటలాడుతున్నాయని వాపోతున్నారు. కారణం ఏంటంటే..

Sea Salt Price
ఉప్పు ధర
author img

By

Published : Nov 23, 2022, 6:31 AM IST

Sea Salt Price: సముద్రపు ఉప్పు ధరలు పెరగటంతో ఉప్పు సాగు చేస్తోన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 250 రూపాయల ధర పలికిన ఉప్పు బస్తా ఇప్పుడు 350 పలుకుతోందని రైతులు అంటున్నారు. అయితే ఈ ధరలు రావటానికి కొన్ని సార్లు.. సాగు చేసిన తర్వాత ఆరు నెలలు వేచి చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఏది ఎమైనా రైతు దగ్గర సేకరించే ధరకు మార్కెట్లో వినియోగాదారునికి లభించే ధరలో తీవ్ర వ్యాత్యాసాలు కనిపిస్తున్నాయి.

ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ, చినగంజాం, పాకల, కనపర్తి, బింగినపల్లి, కొత్తపట్నం తదితర ప్రాంతాల్లో దాదాపు 5వేల ఎకరాల్లో ఉప్పు సాగవుతోంది. వర్షాకాలం మినహాయించి సంవత్సరంలో దాదాపు 9 నెలలు.. రైతులు ఉప్పు సాగు చేస్తుంటారు. జిల్లా నుంచి సుమారు 2వేల టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతోంది. ఈ ఉప్పు సాగుతో 7వేల మంది వరకు రైతులు, 10 వేలకు పైగా రైతు కూలీలు ఉపాధి పొందుతున్నారు.

వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటం, సాగు చేసిన ఉప్పును వ్యాపారులు సిండికేట్​గా మారి తక్కువ ధరకు రైతుల దగ్గర నుంచి సేకరించటం.. ఇలా రైతులకు ఉప్పు ధరలు తక్కువగా ఉండేందుకు సమస్యగా ఉండేది. అయితే ఈ సంవత్సరం తెలంగాణ, తమిళనాడు నుంచి వ్యాపారులు నేరుగా రైతులను సంప్రదించటంతో.. రైతులకు సానుకూలమైన ధరలు పలుకుతున్నాయి. కానీ, కొన్ని పరిస్థితులలో సాగు చేసిన ఉప్పును అమ్ముకోవటానికి ఆరు నెలల వరకు వేచి చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఉప్పు ఉత్పత్తికి పట్టే కాలం ఐదు నెలలు అయితే అమ్ముకోవటానికి అనుకూలమైన ధరల కోసం ఆరు నెలలు పడుతోందని అంటున్నారు. రైతుల వద్ద నుంచి సేకరించే ధరకు మార్కెట్​లో వినియోగాదారునికి ఉండే ధరలో తీవ్ర వ్యత్యాసం ఉండటం గమానార్హం.

వ్యాపారులకు చుక్కెదురు: ప్రకాశం జిల్లాలో వ్యాపారులకు అనుకూలమైన ధర ఉందని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులకు ధరలు అనుకూలంగా ఉండటం లేదు. ఇక్కడి నుంచి తెలంగాణ, తమిళనాడు ప్రాంతాలకు ఉప్పును తరలించేందుకు ఎక్కువ వ్యయం అవుతోందని వ్యాపారులు అంటున్నారు. రైతు దగ్గర రూ.350కి సేకరించిన 70 కేజీల ఉప్పు బస్తా ధర రవాణా ఛార్జీలతో కలుపుకుని దాదాపు రూ.650 పడుతుందని వాపోతున్నారు.

ప్రకాశం జిల్లాలో పెరిగిన సముద్రపు ఉప్పు ధరలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.