ETV Bharat / state

Need Help: వైద్యానికి రూ.24 లక్షలు ఖర్చు... దాతల కోసం బాధితుల ఎదురుచూపులు

కరోనా రక్కసి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేసేలా చేసి, ఎందరినో ఆర్థికంగా దెబ్బతీసింది. తాజాగా ప్రకాశం జిల్లా పాకాల గ్రామానికి చెందిన ఓ యువకుడికి కొవిడ్ సోకింది. చికిత్స అందించేందుకు భారీగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో బాధితుడి తల్లిదండ్రులు... దాతల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక సహాయం చేసి తమ కుమారుడిని కాపాడాలని కోరుతున్నారు.

problems of covid victim patient parents in pakala prakasam district
ప్రకాశం జిల్లాలో కొవిడ్ బాధితుడి తల్లిదండ్రుల ఆవేదన
author img

By

Published : Jul 5, 2021, 10:33 PM IST

problems of covid victim patient parents in pakala prakasam district
ప్రకాశం జిల్లాలో కొవిడ్ బాధితుడి తల్లిదండ్రుల ఆవేదన

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామానికి చెందిన దార్ల దీక్షిత్​కు.. కరోనా సోకింది. పరిస్థితి విషమించడంతో దీక్షిత్​ను కుటుంబసభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు... ఊపిరితిత్తులు 70 శాతం చెడిపోయాయని, చికిత్స కోసం రూ.24 లక్షలు ఖర్చవుతాయని తెలిపారు.

ఊహించని ఈ ఘటనతో దీక్షిత్ కుటుంబీకులు హతాశులయ్యారు. వైద్యం కోసం అంత డబ్బు చెల్లించలేమని, దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని దీక్షిత్ తల్లి దార్ల హేమలత కన్నీటి పర్యంతమయ్యారు. సాయం చేయాలనుకునే వారు 8790271408 నంబర్​కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

GK. Dwivedi: 'జగనన్న హౌసింగ్ కాలనీలకు ఇసుక కొరత లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.