ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ప్రైవేటు లెక్చరర్ అండ్ యూనియన్ నియోజకవర్గ కన్వీనర్ గుమ్మా రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
తెలంగాణ ప్రభుత్య తరహాలో ఈ రాష్ట్రంలో కూడా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలన్నారు. కరోనా కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూతపడిపోవడంతో తాము జీవనోపాధి కోల్పోయామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా కరోనా సెకండ్ వేవ్ రూపంలో మమ్మల్ని కాటేసిందన్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్, మండల విద్యాశాఖాధికారికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఇదీ చదవండీ…కరోనాను వదలటం లేదు.. సైబర్ కేటుగాళ్లు!