ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ వ్యతిరేకంగా బీజేవైఎం కార్యకర్తలు ఒంగోలులో నిరసన తెలిపారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. ప్రకాశం జిల్లా భాజపా ప్రధాన కార్యదర్శి రమిసెట్టి హరిబాబు తదితరులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు.
జాబ్ క్యాలెండర్ పై రాష్ట్రమంతటా నిరుద్యోగులలో తీవ్రమైన నిరాశ ఆందోళన వ్యక్తమవుతోందని రమిసెట్టి హరిబాబు అన్నారు. అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: కోటికలపూడి హత్య కేసులో నిందితులు అరెస్టు