రాబోయే రోజుల్లో హోం గార్డులకు సంబంధించిన గుర్తింపు కార్డులు, పోలీసు క్యాంటిన్ కార్డులు అందజేస్తామని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్ తెలిపారు. ఒంగోలు పోలీస్ కల్యాణ మండపంలో జిల్లాలో ఉన్న హోమ్ గార్డులతో ఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. పోలీసు సిబ్బందితో కలసి హోం గార్డులు మేరుగైన సేవలు చేస్తూ.... ప్రజల మన్ననలు పొందుతున్నారని ప్రశంసించారు. కోపరేటివ్ సొసైటికి సంబంధిచిన చెక్కులనూ త్వరలో అందిస్తామని పేర్కొన్నారు.
త్వరలో టాటా ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని.. పోలీసు సిబ్బందితో పాటు హోం గార్డులు టెక్నికల్ కోర్సు నేర్చుకోవచ్చని తెలిపారు. ఈ శిక్షణలో నైపుణ్యం ప్రదర్శించిన వారికి వారు కోరిన ప్రదేశంలో పోస్టింగ్, టెక్నికల్కు సంబంధించిన విధులను కేటాయిస్తామన్నారు.
హోం గార్డులకు బీమా సౌకర్యం, రుణాలు వంటివి ఇచ్చేందుకు ఆయా బ్యాంకులు, బీమా కంపెనీలతో చర్చిస్తామన్నారు. తమ సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఎస్పీకి హోం గార్డ్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. గోవింద్, జిల్లా అధ్యక్షుడు డి.బాబురావు , సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: