వ్యక్తిగత గొడవలతో అంగన్వాడీ కేంద్రానికి తాళం వేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆయా, కార్యకర్తకు మధ్య వివాదం తలెత్తింది. దీంతో అంగన్వాడీ కేంద్రానికి చెరో తాళం వేశారు. ఆయా రాకపోవడంతో అంగన్వాడీ కేంద్రానికి తాళం తెరవలేదు. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చూడండి.
మార్కాపురంలో తెదేపా టీ షర్టుల పట్టివేత