ETV Bharat / state

పల్లెల్లో కరోనా విలయం.. నిర్లక్ష్యమే వ్యాప్తికి కారణం!

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. మెుదటి దశలో పట్టణాలు అతలాకుతలం అయినప్పటికీ... పల్లెలు కాస్త ప్రశాంతంగానే ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆ పల్లెలు సైతం మహమ్మారి ధాటికి విలవిలలాడుతున్నాయి. కరోనా లేని గ్రామం కనిపించటం లేదు. ఏం అవుతుందిలే అన్న నిర్లక్ష్యం.. పండుగలు, ఫంక్షన్లు అంటూ గుమిగూడటం.. గ్రామాల్లో వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోంది. పాజిటివ్‌ వస్తే ఊర్లో అంటరాని వారిగా చూస్తారనే భయంతో నిర్ధరణ పరీక్షలు చేయించుకోకపోవడంతో అసలుకే మోసం వస్తోంది. దీంతో.. గ్రామీణ ప్రాంత వాసుల అవగాహన రాహిత్యం కరోనా వ్యాప్తికి కొండంత బలంగా మారింది.

villages corona news
villages corona news
author img

By

Published : May 11, 2021, 1:51 PM IST

ప్రకాశం పల్లెల్లో కరోనా విలయం.. నిర్లక్ష్యమే వ్యాప్తికి కారణం!

రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు వారం రోజులుగా సగటున రోజూ దాదాపు 17 వేల మార్క్‌ అందుకుంటున్నాయి. రోజువారి మరణాలు కూడా వందకు చేరువలో ఉన్నాయి. ఇందులో అధిక శాతం గ్రామాల్లోనే వెలుగు చూస్తుండటం కలవరానికి గురిచేస్తోంది. ప్రధానంగా విజయనగరం, తూర్పుగోదావరి, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని గ్రామాల్లో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది. కొవిడ్‌ వ్యాప్తిపై అవగాహన లేకపోవడం, కరోనా లక్షణాలున్నా సరైన వైద్యం తీసుకోకపోవడం వంటి తదితర కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా తిష్ఠ వేస్తోంది.

రోజుకు వెయ్యి..

ప్రకాశం జిల్లాలో రోజూ వెయ్యికి పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 70శాతం కేసులు గ్రామాల్లోనే వెలుగు చూస్తున్నాయి. లక్షణాలను తొందరగా గుర్తించి.. సకాలంలో చికిత్స తీసుకుని బయటపడుతున్న వారు కొందరైతే.. ఆఖరి నిమిషం వరకూ పోరాడి ప్రాణాలు కొల్పోతున్న వారు మరికొందరు. తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంత నియోజక వర్గాలైనా ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం, జగ్గంపేట, తుని నియోజకవర్గాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో వెలుగు చూస్తున్న కేసుల్లో 90శాతానికి పైగా పల్లెల్లోనే నమోదవుతున్నాయి. దీంతో.. పల్లెల్లో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ జ్వరం వచ్చినా.. కరోనానేమో అని పరీక్ష కేంద్రాలకు పరిగెడుతున్నారు. కొందరు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. నిత్యావసరాలకు తప్ప.. బయటికి వెళ్లడానికే జంకుతున్నారు.

అంటరాని వారిగా చూస్తారని భయం..

రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. గ్రామాల్లో దాదాపు అన్ని కుటుంబాల్లో పరిస్థితి ఇదే. రోజూ తప్పనిసరి పనులకు వెళ్లాలి. అందులో భాగంగా.. పొల్లాల్లో పనిచేసే రైతులు, కూలీలూ దాదాపుగా మాస్కులు ధరించడంలేదని.. భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నారు. వారు మాస్కును అవరోధంగా భావిస్తున్నారు. ఇదే వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోందని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే పని చేసే క్రమంలో.. ఒకరు తెచ్చుకున్న ఆహారం ఇంకొకరు పంచుకోవడం వంటి పరిణామాలు వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నాయి. పట్టణాలు, మండల కేంద్రాలకు స్థానిక ప్రజా రవాణానే ఉపయోగించటం కూడా వైరస్ వ్యాప్తికి మరో కారణం. పాజిటివ్‌ వచ్చిన కొందరు వ్యక్తులు తమకు కరోనా సోకిందన్న విషయం బయటకు చెప్పకుండా.. వీధుల్లో తిరుగుతున్నారు. కరోనా నిర్ధరణ అయితే ఊర్లో అంటరాని వారిగా చూస్తారన్న కారణంతో మరికొందరు నిర్ధరణ పరీక్షలు చేయించుకోవడం లేదు. తద్వారా.. తెలియకుండానే పల్లెల్లో వైరస్‌ వ్యాప్తి అధికమవుతోంది.

ఇది ఇలా ఉంటే.. కరోనా కారణంగా ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు చనిపోతుండటం కలవరానికి గురి చేస్తోంది. మే 1న.. కాకినాడలో పది నిమిషాల వ్యవధిలో తల్లి, కొడుకును కరోనా బలితీసుకుంది. తిరుపతి గ్రామీణ మండలం చిగురువాడలో భర్త అంత్యక్రియలు పూర్తికాగానే భార్య మృతి చెందింది. ఇలా.. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదంతాలు.

స్వల్ప లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు సూచిస్తున్నప్పటికీ.. ప్రజల నుంచి అంతంతమాత్రంగానే స్పందనే లభిస్తోంది. లక్షణాలు కనిపిస్తే.. ఇది కరోనా కాదని వారే నిర్ధరించుకుని.. చిట్కాలు, ఆర్​ సూచించిన మందులతో కాలయాపన చేస్తున్నారు. దీంతో ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది. పోనీ, పరీక్ష చేయించుకున్నప్పటికీ ఫలితాలు రావడం ఆలస్యమవుతున్నాయి. దీంతో.. పెద్దగా కనిపించకుండానే కరోనా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది.

ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేలా క్షేత్రస్థాయి యంత్రాంగం కృషి చేయాలి. పరీక్షల సంఖ్యను పెంచడం, వైరస్‌ బాధితులకు సకాలంలో చికిత్స అందించడం, ఐసోలేషన్‌ కేంద్రాలు పెంచడం వంటి చర్యలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా.. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ నిల్వల్ని పెంచి.. ప్రతి ఒక్కరికి టీకా అందించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: విషాదం: రోడ్డు ప్రమాదంలో కుమారుడు..గుండెపోటుతో తండ్రి !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.