వెలిగొండ ప్రాజెక్టు మెుదటి సొరంగం పనులు 2020 జూన్ నాటికి పూర్తికానున్నాయి. ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఈ విషయాన్ని తెలిపారు. ప్రాజెక్టు అధికారులతో మార్కాపురంలోని ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్‌కల్లా రైతులకు నీరు ఇచ్చి తీరుతామని మీడియాతో కలెక్టర్ చెప్పారు. రెండో సొరంగం పనులు 2021 డిసెంబర్‌కు పూర్తి చేసేలా కృషి చేస్తామన్నారు. నిర్వాసితుల సమస్యలు వచ్చే15 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు.
ఇదీ చదవండి: 'ప్రకాశం జిల్లా బోగస్ పట్టాల ఘటనపై విచారణ నెల రోజులు వాయిదా'