నేర పరిశోధనల్లో పోలీసులు ఎన్ని జాగ్రత్తల తీసుకున్నా.... ఒక అడుగు ముందుకేసి అంతకు మించి తెలివితేటలను ప్రదర్శిస్తూ తప్పించుకుంటున్నారు నేరస్థులు. సవాళ్లను అధిగమించేందుకు పోలీసులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ పరిస్థితులను గమనించిన ప్రకాశం జిల్లా పోలీసులు నేర పరిశోధనకు ఉపయోగపడే విధంగా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకున్నారు. కేసుల్లో పురోగతి సాధించాలనే లక్ష్యంతో ఈ కొత్త ఆలోచనకు రూపకల్పన చేశారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. ఎస్సై, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులకు స్మార్ట్ పోలీసింగ్-ఆన్‌లైన్ దర్యాప్తు సాధనాలు అనే అంశంపై శిక్షణ అందించారు.
పేరుతో నేరస్థుడి గుట్టురట్టు
నేరస్థులకు సంబంధించిన సమాచారాన్ని వివిధ మార్గాల ద్వారా పోలీసులు సేకరిస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్, ప్రజా సాధికార సర్వే, ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, పాన్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిలో పొందుపొరచిన వివరాలను యాప్‌లో నమోదుచేస్తున్నారు. యాప్‌లో అనుమానితుడి పేరు నమోదు చేస్తే.... అతడి చరిత్ర మొత్తం చూపేలా సాంకేతికతను వినియోగించారు. స్మార్ట్ ఫోన్ ద్వారానే ఈ యాప్‌ను వినియోగించేందుకు వీలుగా రూపొందించారు. ఈ కొత్త విధానం వల్ల నేర పరిశోధన త్వరితగతిన పూర్తిచేయడంతో పాటు పక్కా ఆధారాలు లభ్యమవుతాయని ఎస్పీ చెబుతున్నారు.
పెరుగుతున్న సాంకేతిక వనరులను సమర్థంగా వినియోగించుకోగలిగితే మంచి ఫలితాలు సాధించవచ్చని పోలీస్ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి :