ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ముగిసినప్పటికీ.. రాజకీయ వాతావరణం చల్లారలేదు. గ్రామంలోని ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఆలకూరపాడులో తొలివిడత ఎన్నికల సమయంలో ఇరు వర్గాల కార్యకర్తల మధ్య స్వల్ప వివాదం సంభవించింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. వారికి పోలీసులు సర్ది చెప్పి.. బైండోవర్ పెట్టి పంపించారు.
ఈ క్రమంలో పిల్లి మాధవరావు, అతని సోదరుడు మాలకొండయ్య అనే ఇద్దరు.. ద్విచక్రవాహనంపై టంగుటూరు వెళ్ళి వస్తుండగా.. దారికాసి పలువురు దాడికి పాల్పడ్డారు. కర్రలతో, ఇనుపరాడ్లతో వీరిని తీవ్రంగా కొట్టి, గాయపరిచారు. సృహ తప్పి పడిపోయిన ఇద్దరినీ.. అతని బంధువులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో.. వైద్యుల సూచన మేరకు ఒంగోలులోని ప్రయివేట్ వైద్యశాలలో తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: