అనుమతులు లేకుండా గ్రానైట్ బండలు తరలిస్తున్న లారీని ప్రకాశం జిల్లా మార్టూరు పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. లారీని స్టేషన్ కు తరలించారు. ముందస్తు సమాచారం మేరకు రాజుపాలెం అడ్డరోడ్డు వద్ద వాహనాలను తనిఖీలు చేస్తున్న పోలీసులు.. ఓ లారీని అడ్డుకున్నారు.
గ్రానైట్ బండల లోడును ఆ లారీలో గుర్తించారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేవని తేల్చారు. వెంటనే డ్రైవర్ ను అరెస్ట్ చేసి లారీని స్వాధీనం చేసుకున్నారు. మార్టూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమంగా గ్రానైట్ తరలిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: