ప్రకాశం జిల్లా చీరాలలోని రామాపురం వెళ్లే రహదారిలో కుందేరు కాలువ వద్ద పట్టణంలో సేకరించిన చెత్తను మున్సిపల్ సిబ్బంది అక్కడ పడేస్తున్నారు. దీంతో ఆప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతుంది. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి రామాపురంలో డంపింగ్ యార్డ్ నిర్మించారు. కానీ, పట్టణంలోని చెత్తను గొల్లపాలెంలోని భాష్యం స్కూలు పక్కకు తరలిస్తున్నారు. అసలే కరోనాతో ఇబ్బందులు పడుతున్నారని... చెత్త వేయటం వల్ల రోగాల బారిన పడతామని భయంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి ఇక్కడ చెత్తవేయకుండా రామపురంలోని డంపింగ్ యార్డుకు తరలించాలని ఈ ప్రాంతప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి రూ. 100లకే 11కేజీల కూరగాయలు