ETV Bharat / state

CSR COLLEGE: ఎయిడెడ్‌ సంస్థల మూసివేత.. ప్రశ్నార్థకంగా శర్మ కళాశాల భవిష్యత్తు! - government decision on aided colleges closing

అదో చరిత్రాత్మక విద్యా సంస్థ. వెనకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో విద్యా కుసుమాలు పూయించిన కళాశాల. ఎందరో ఉన్నత విద్యా వంతులను, సినీ ప్రముఖలను అందించిన కళామతల్లి. అలాంటి కళాశాల పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో కళాశాల ఆనవాళ్లకు బీటలువారే ప్రమాదం ఏర్పడింది. ఎయిడెడ్‌ కళాశాలగా సేవలందించిన ఒంగోలుకు చెందిన శర్మ కళాశాల భవితవ్యం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

సీఎస్ఆర్‌.శర్మ కళాశాల
సీఎస్ఆర్‌.శర్మ కళాశాల
author img

By

Published : Aug 12, 2021, 8:13 PM IST

ప్రశ్నార్థకంగా శర్మ కళాశాల భవిష్యత్తు

ప్రకాశం జిల్లా ఒంగోలులో 18 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 1952 సంవత్సరం ఆగస్టు 1న సీఎస్ఆర్‌.శర్మ కళాశాల ఏర్పాటైంది. ఏడు దశాబ్దాలుగా ఎందరో ఉన్న విద్యావంతులు, సినీప్రముఖులను అందించిన ఈ కళాశాల పరిస్థితి నేడు ప్రశ్నార్థకంగా మారింది. నూతన విద్యా చట్టం ప్రకారం ఎయిడెడ్‌ విద్యా సంస్థలను మూసివేసే విధంగా ప్రభుత్వం ఆర్ఢినెన్స్‌ తీసుకువచ్చింది. కళాశాల ఆస్తులను, బోధన సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించింది. సొంతంగా నిర్వహించుకోవాలంటే ప్రైవేటుగా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఈ కళాశాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయసహకారాలు అందవు. కళాశాలలో ఉన్న సిబ్బందిని ఇతర ప్రభుత్వ విద్యా సంస్థల్లో సర్కారు నియమిస్తోంది. 2004లో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్‌- 35 తో కళాశాల కష్టాల్లో పడింది. అధ్యాపకులు పదవీవిరమణ చేస్తే, వారి స్థానంలో కొత్తవారిని నియమించుకునే అవకాశం లేకుండా ఆ జీవో వుండటంతో, అధ్యాపకుల కొరత ఏర్పడింది. అయినప్పటికీ యాజమాన్యం నిర్వహణ భారాన్ని మోస్తూ, కళాశాలను కాపాడుకుంటూ వచ్చారు.

విద్యనభ్యసించిన ప్రముఖులు..

ఈ కళాశాలలో ఇంటర్‌ లో అన్ని గ్రూపులతో పాటు, డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ గ్రూప్‌లు, 2003 నుంచి పోస్టుగ్రాడ్యుయేషన్‌ గ్రూపులు నిర్వహిస్తున్నారు. వీరి కోసం వంద మందికి పైగా బోధనా సిబ్బంది విధుల్లో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ అమలైన తరువాత కళాశాలకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఫలితంగా కళాశాలలో చదివే విద్యార్థులు ప్రైవేటు కళాశాలల వైపు మొగ్గు చూపారు. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం, ప్రైవేట్‌ కళాశాలలనుంచి పోటీ ఎదుర్కోవడం వల్ల శర్మ కళాశాలకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఇక్కడ మెగాస్టార్‌ చిరంజీవి, మాదాల రంగారావు, గిరిబాబు, టీ. కృష్ణ, నల్లూరి వెంకటేశ్వరరావు, హరనాథ రావు, మద్దూరి రాజా, వందేమాతరం శ్రీనివాస్‌, ఐఏఎస్, ఐపీఎస్ లు నండూరి సాంబశివరావు, జెడీ శీలం వంటి గొప్పవారు ఈ కళాళాలలోనే విద్యనభ్యసించారు.

ప్రైవేటుగా నిర్వహించుకునే యోచన..

తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో మిగిలిన 8 మంది సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. అయినప్పటికీ కళాశాలను ప్రైవేటుగా నిర్వహించుకోడానికి యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్ఠలు కలిగి ఉన్న ఈ కళాశాలను ప్రోత్సహిస్తే, మరెందరో ఉత్తమ విద్యావేత్తలను తయారుచేయడానికి అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఒంగోలులో ఉండే విద్యార్థులు పీయూసీ తరువాత చీరాల, గుంటూరుకు వెళ్లి చదువుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. వీరి ఇబ్బందులను గుర్తించి ఇక్కడ ఒక కళాశాలను స్థాపించారు. ఒకానొక సమయంలో మూడువేల మంది విద్యార్థులతో రెండు షిఫ్టుల్లో కళాశాల నడిచింది. 170మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉండేవారు. --హరికృష్ణ, పూర్వ విద్యార్థి

ప్రభుత్వ నిర్ణయంతో ఎయిడెడ్ వ్యవస్థ నిర్మూలమవుతుంది. రాష్ట్రంలో కేవలం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు మాత్రమే ఉంటాయి. --శ్రీనివాసరావు, సీఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపల్

ఇవీ చదవండి:

Fake Ticket: తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం.. విజిలెన్స్ దర్యాప్తు

TDP PROTEST: 'జాబ్‌ క్యాలెండర్ రూపకల్పనలోనూ.. వక్ర బుద్ధి చూపించారు'

గెట్ రెడీ.. ఈ వీకెండ్​ 9 సినిమాలు రిలీజ్

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,859 కరోనా కేసులు..13 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.