ETV Bharat / state

విజయానికి ఒక్క అడుగు దూరంలో..

author img

By

Published : May 9, 2020, 8:06 AM IST

రాష్ట్రంలో కరోనాను జయించిన ప్రాంతంగా మారేందుకు ఆ తొలి జిల్లా ఒక్క అడుగుదూరంలో ఉంది.! కరోనా సోకిన వారిలో ఒక్కరు మినహా అంతా కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. 98 శాతానికిపైగా డిశ్చార్జ్‌ రేటున్న ఆ జిల్లా ఏది.? అక్కడి సిబ్బంది తీసుకున్న చర్యలేంటి?

only one case in prakasham district
ఒంగోలులో ఒకే కరోనా కేసు

రాష్ట్రంలో కరోనా కేసులు తొలి దశలోనే బయటపడిన జిల్లాల్లో ప్రకాశం కూడా ఒకటి. లండన్‌ నుంచి వచ్చిన యువకుడే తొలి బాధితుడు. అతణ్ని వెంటనే రిమ్స్‌లో ఐసోలేట్‌ చేయడం, నివాస ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ చేయడం, కాంటాక్టులను గుర్తించడంలో యంత్రాంగం వేగంగా స్పందించింది. పరిస్థితి అదుపులోనే ఉందనుకున్న సమయంలో దిల్లీ మర్కజ్‌ కేసులు సవాల్‌ విసిరాయి. వందల మందిని క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు చేశారు. జిల్లాలో 61 కరోనా కేసులు జిల్లాలో నమోదవగా వీరిలో 60 మందిని నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం ఒకరికి మాత్రమే చికిత్స జరుగుతోంది. జిల్లా కొవిడ్‌ నోడల్‌ అధికారి జాన్‌ రిచెట్స్‌, రిమ్స్‌ సూపరింటెండెంట్‌ సమన్వయంతో కరోనా కట్టడి చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జిల్లా ఇండియన్‌ మెడికల్‌ ఆసోషియేషన్‌ సిబ్బంది సైతం సాధారణ వైద్య సేవలు, కంటైన్మెంట్‌ జోన్లలో కరోనా పరీక్షల నమునాల సేకరణ వంటి కార్యక్రమాల‌్లో తోడ్పాటు అందించడం వైద్యులపై పనిభారాన్ని తగ్గించింది.

కరోనాపై పోరాటంలో ప్రకాశం జిల్లాకు ఇప్పుడు పూర్తి సౌకర్యాలున్నాయి. తొలుత అనుమానితుల నమూనాలు తిరుపతి, విజయవాడ పంపేవారు. తర్వాత ఒంగోలు రిమ్స్‌ వైద్యకళాశాలలోనే వీఆర్డీఎల్ ప్రయోగశాల ఏర్పాటు చేయటం పరీక్షల్లో వేగాన్ని పెంచింది.

కరోనా రోగుల్లో ఒక్కరు మినహా అందరూ కోలుకున్నా.. ఏమాత్రం అలసత్వంగా లేమని కొత్త కేసులొచ్చినా చికిత్స అందించేందుకు సిద్ధమంటున్నారు ఒంగోలు రిమ్స్‌ వైద్యులు.

ఇదీ చదవండి : అనంత’ కరోనా!... రాష్ట్రంలో కొత్తగా 54 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.