ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం అంబడిపూడి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్ని రోజులుగా గంగవరపు శేషయ్య, నాగేశ్వరమ్మ దంపతులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తెల్లవారిన ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా.. విగత జీవులుగా పడి ఉన్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Suicide attempt: ఎన్‌కౌంటర్ భయంతో ఇద్దరి ఆత్మహత్యాయత్నం