చీరాలలో క్షుద్రపూజల కలకలం.. స్థానికుల ఆందోళన - ప్రకాశం జిల్లాలో క్షుద్రపూజలు
ప్రకాశం జిల్లా చీరాల కారంచేడు మధ్య పురపాలక సంఘ ఆర్చి వద్ద పొలాల్లో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించటంతో స్దానికులు భయాందోళనకు గురయ్యారు. వేకువజామున రోడ్డు మధ్యలో పంది పిల్లను బలిచ్చి కొబ్బరికాయ, నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో పూజలు చేసి ఉండటంతో అటు వైపు వెళ్లేందుకు రైతులు, పశువుల కాపరులు జంకుతున్నారు. అర్ధరాత్రి నుంచి పౌర్ణమి గడియలు కావడం వల్ల ఎవరో కావాలనే పూజలు చేసుంటారని స్థానికులు భావిస్తున్నారు.
చీరాలలో క్షుద్రపూజల కలకలం