పట్టెడన్నం పెట్టే రైతు ధనుర్మాసాన్ని ప్రత్యేకంగా భావిస్తారని, ప్రకృతితో మమేకమైమ రైతు మారుతున్న కాలంలో గౌరవం కోల్పోతున్నాడని 'రైతే రాజు' ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రం నిర్వహకులు శివపార్వతి అన్నారు. ప్రకృతి ఉత్పత్తులు ప్రాచుర్యానికి, ప్రకృతి వ్యవసాయం చేసే రైతు గుర్తించి 'విష్ణు హారతి' అనే కార్యక్రమం పేరుతో సన్మానించారు.
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి చెందిన రామారావు అనే ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తన ఇంటి ఆవరణను చిన్నపాటి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దారు. ఒక ఆవుని కొని దాని ద్వారా వివిధ రకాల ఔషధాలు, కషాయాలు తయారు చేసి సాటి రైతులకూ అందించేవాడు.
తన పొలంలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేశాడు. అంతేకాకుండా కొత్తపట్నం మండలంలో పలు గ్రామాల్లో రసాయనిక వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయానికి మారేలా చేశాడు. ప్రకృతి వ్యవసాయ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తించారు ఒంగోలుకు చెందిన 'రైతే రాజు' ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కేంద్రం నిర్వహకులు శివ పార్వతి. ప్రకృతి ఉత్పత్తుల వినియోగదారులు కలిసి రామారావు సేవలను గుర్తించి సత్కరించారు.
ఇదీ చదవండి: