జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పలు జిల్లాలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన సీవీ రామన్‌కు నివాళులర్పించారు.
ప్రకాశం జిల్లా
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా పంగులూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల మేథస్సును పెంపొందించేందుకు సైన్స్ ఫెయిర్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు తెలిపారు. రైతులకు ఉపయోగపడే విధంగా తయారు చేసిన మంకీ గన్ ఉత్తమ బహుమతికి ఎంపిక అయ్యింది... గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు.
కృష్ణా జిల్లా
విజయవాడలోని ప్రాంతీయ సైన్స్ సెంటర్‌లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. దేశ ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన మేదావి సర్ సీవీ రామన్‌కు నివాళులర్పించారు. వివిధ రంగాల ఆవిష్కరణలను ప్రదర్శించారు. నాగాయలంక మండలం భావదేవరపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైతం సైన్స్ దినోత్సవం నిర్వహించారు.
ఇదీ చదవండి