PLANTS: ఈ ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలేనికి చెందిన చెన్నా వెంకట నాగేంద్రరావు వృత్తి రీత్యా చేనేత కార్మికుడు. బండారు నాగేశ్వరరావు కాలనీలో నివాసముంటున్నారు. నిత్యం తీరికలేకుండా చేనేత పని చేసే వెంకటనాగేంద్రరావుకు మొక్కల పెంపకం అంటే ఎంతో మక్కువ. ఇంటి ఆవరణలోనే వివిధ జాతులకు చెందిన రకరకాల వందలాది మొక్కలను పెంచుతూ... ఇంటినే నందన వనంగా మార్చేశారు. పూలమొక్కలు, క్రోటాన్ మొక్కలు, ఆహ్లాదం పంచే వివిధరకాల పూల మొక్కలు, ఔషధ మొక్కలను సైతం పెంచుతున్నారు.
పనికిరాని ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలు, ప్లాస్టిక్ డ్రమ్ములు, తాగిపడేసిన కొబ్బరి బోండాలు, కొబ్బరిచిప్పలు, వాహనాల టైర్లు, ప్లాస్టిక్ గ్లాసుల్లో సైతం మొక్కలు పెంపకం చేపట్టి ఔరా అనిపిస్తున్నారు నాగేంద్రరావు. పాడైపోయిన సైకిల్‌కి అందమైన రంగులు వేసి వాటిలో కూడా మొక్కలు పెంచి... ఆశ్చర్యపరుస్తున్నారు. ఆ ఇంటి వైపుగా వెళ్లేవారు మొక్కలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఎరువులను సేంద్రీయ పద్ధతుల్లో తయారుచేసుకుని రోజులో కొంత సమయం మొక్కల సంరక్షణకు వెచ్చిస్తున్నట్లు వెంకట నాగేంద్రరావు చెబుతున్నారు.
ఇదీ చదవండి: PERNI NANI COMMENTS ON RGV: సినిమాను నిత్యావసరంగా లేదా అత్యవసరంగా భావించట్లేదు: పేర్ని నాని