ప్రకాశం జిల్లా మార్టూరు మండలం వలపర్లలో వైకాపాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పాఠశాల విద్యా కమిటీలకు సంబంధించి సొంత పార్టీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. నియోజకవర్గ స్థాయినేతలు విద్యాకమిటీ ఛైర్మన్‌ను ఏకగ్రీవంగా ప్రకటించారు. అది జీర్ణించుకోలేని మరో వర్గం నేతలు పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలుకాగా.. వారిని మార్టూరు ఆసుపత్రికి తరలించారు.
ఇదీచదవండి