ETV Bharat / state

ఎన్నికలకు సమీపిస్తున్న సమయం.. ప్రచార జోరు పెంచిన పార్టీలు

మున్సిపల్ ఎన్నికల్లో తమకు ఓటేసి గెలిపించాలని.. వివిధ ప్రాంతాల్లో, పలు పార్టీల రాజకీయ నాయకులు అభ్యర్థిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు సైతం ప్రచారంలో పాల్గొని.. ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు.

author img

By

Published : Mar 6, 2021, 7:54 PM IST

municipal elections campaign
ఎన్నికల ప్రచార జోరు

ప్రకాశం జిల్లాలో...

ప్రకాశం జిల్లా అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ.. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. తెదేపా అభ్యర్థికి ఓటు వేసి.. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెదేపాలోకి చేరిన వైకాపా సీనియర్ నాయకుడు గోరంట్ల లక్ష్మణదాసును.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అద్దంకి 9వ వార్డులో

వైకాపా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిని ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ.. అద్దంకిలోని 9వ వార్డులో వైకాపా నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్​ఛార్జి కృష్ణ చైతన్య, మాజీ ఎమ్మెల్యే గరటయ్య ప్రచారంలో పాల్గొన్నారు. వైకాపా అభ్యర్థి వెంకట రత్నకుమారిని మెజారిటీతో గెలిపించాలని కోరారు.

విశాఖపట్నంలో..

జీవీఎంసీ ఎన్నికల్లో తెదేపా కార్పొరేటర్ అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. 84వ వార్డులో తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి మాదంశెట్టి చిన్నతల్లి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. తనకు ఓటు వేసి.. తెదేపాను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో..

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పురపాలక ఎన్నికల ప్రచార హోరు పెరిగింది. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెదేపా కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా.. 1,7,10,12,15 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం వచ్చిందనీ.. తెదేపా అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని తోట సీతారామలక్ష్మి అన్నారు.

ఇదీ చదవండి: నగర నగారా: విజయవాడలో అధికార పార్టీ మేయర్ అభ్యర్థి ఎవరు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.