ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మయపాలెంలో విషాదం జరిగింది. కుమారుడు మృతి చెందాడన్న వార్త విన్న తల్లి గుండెపోటుతో మరణించింది. గ్రామానికి చెందిన సుబ్బారావు వ్యవసాయ పనుల నిమిత్తిం దమ్ము ట్రాక్టర్‌తో పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు.
ఈ విషయం తెలిసిన సుబ్బారావు తల్లి రాఘవమ్మ గుండెపోటుతో ఇంటిలోనే కుప్పకూలింది. ఇంటికి ఆసరా అయిన వ్యక్తి... కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండే ఆమె మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి: