ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ప్రకాశం జిల్లా చీరాలలో పర్యటించారు. అందరూ సామాజిక దూరం పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. నిత్యావసర దుకాణాలు, కూరగాయల దుకాణ యజమానులతో మాట్లాడారు. సరైన రవాణా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే బలరాం దృష్టికి వ్యాపారులు తీసుకొచ్చారు. అధికారులతో ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని వ్యాపారులకు ఎమ్మెల్యే చెప్పారు. లబ్దిదారులకు ఇంటికే రేషన్ సరుకులు పంపించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: