మహిళలకు అన్ని విధాలా అండగా నిలుస్తూ.. వారి సాధికారత కోసం సీఎం జగన్ పాటుపడుతున్నారని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలోని మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో.. పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బ్యాంకుల ద్వారా తమ ప్రభుత్వం నేరుగా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు అందిస్తోందన్నారు. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కమిషన్ యేసయ్యలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇదీ చదవండి:
'మహిళా సాధికారత కోసం సీఎం ఎంతో చేస్తున్నారు..' - dwakra women meet in chirala
మహిళా సాధికారత కోసం సీఎం జగన్ ఎంతో చేస్తున్నారని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కొనియాడారు. ప్రకాశం జిల్లా చీరాలలో సున్నావడ్డీ పథకం లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.