పేద ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని వైకాపా కార్యాలయంలో నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులు పంపిణీ చేశారు. 28 మంది లబ్ధిదారులకు 15,08,000 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 108, 104 వాహనాలను అధునాతన పరికరాలతో రూపొందించారన్నారు.
ఇవీ చూడండి... : 'మా గ్రామంలో కరోనా మృతదేహాన్ని ఖననం చేయవద్దు'