Mirchi Crops Problems In Prakasam District : ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఈ ఏడాది కరవు పరిస్థితులు తాండవిస్తున్నాయి. పంటలకు నీళ్లు లేక ఎండుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా మిర్చి మొక్కలకు తెగుళ్లు సోకుతున్నాయి. వర్షాలు సరిగా కురవక, సాగర్ కాల్వకు సాగునీరు విడుదల చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కొత్త తెగుళ్లు సోకటమే కాకుండా మొక్క ఎదుగుదల కష్టంగా మారిందని రైతులు వాపోయారు. కాయ కాసే సమయానికి ముడత తెగులు, వేరు కుళ్లు తెగులు వచ్చి మొక్క వాడిపోయిందన్నారు. ఎకరాకు లక్ష రూపాయల వరకూ ఖర్చు పెట్టినా దిగుబడి లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు.
పతనం దిశగా తెల్ల బంగారం ధర - మార్కెట్లలో రైతులకు స్వాగతం పలుకుతున్న సమస్యలు
Mirchi Farmers Problems In Andhra Pradesh : గతంలో ఎప్పుడూ ఇలాంటి తెగుళ్లు రాలేదని... వచ్చినా మందులు వాడితే మొక్క బతికేదని రైతులు అంటున్నారు. ఈ ఏడాది వచ్చిన తెగుళ్లకు ఎన్ని పురుగు మందులు, ఎరువులు వాడినా ఫలితం దక్కలేదని వాపోతున్నారు. మరికొందరు పక్క పొలాలకు తెగుళ్లు వ్యాపించకుండా ఉండేందుకు పంటను తొలగిస్తున్నారు. తొలగించిన చోట మళ్లీ మొక్కలు నాటుతున్నారు. దీంతో అదనంగా ఎకరాకు మరో 25వేల వరకూ ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. పంట తెగుళ్లపై వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు.
వరి రైతుల కష్టం వర్షార్పణం - ప్రభుత్వం నిబంధనలు సడలించి ఆదుకోవాలని వేడుకోలు
ప్రభుత్వం మాకు ఎటువంటి సహాయం చెయ్యడం లేదు. వ్యవసాయశాఖ వారు కనీసం సలహాలు ఇవ్వడానికి కూడా మా వైపు చూడటం లేదు. పుచ్చు వచ్చి, ముడత వచ్చి పంట అంతా నాశనం అయ్యింది. కొత్త తెగుళ్లతో పంట అంతా నాశనం అవుతుంది. గత ఐదారు సంవత్సరాల క్రితం జరిగింది ఇలా.. మళ్లీ ఇప్పుడు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకుండా పోతుంది. - బాధిత రైతులు
పంట నష్టాన్నిఅంచనా వేయాలన్న ప్రభుత్వం - జంకుతున్న అధికారులు- జగన్ వ్యాఖ్యలే కారణమా?
Farmers Drought Conditions In Prakasam : తెగుళ్లకు కారణాలు గుర్తించి, అందుకు తగిన పురుగుమందులు పంపిణీ చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే లక్షల్లో పెట్టుబడులు పెట్టాము.. అంతా నష్టమే. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. వ్యవసాయ అధికారులు పంటలకు మందులు సూచించాలని అర్థిస్తున్నారు.
కరవు తాండవిస్తున్నా కల్లబొల్లి మాటలతో కప్పిపుచ్చే యత్నం - రైతుల కన్నీరు కనిపించడం లేదా?