కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని జార్జి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారెంటైన్ను ఎమ్మెల్యే నాగార్జునరెడ్డితో కలిసి సందర్శించారు. క్వారెంటైన్లో ఉన్న 105 మందిలో 14 రోజులు పూర్తి చేసుకున్న 74 మందిని ప్రత్యేక వాహనాల్లో స్వస్థలాలకు తరలించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాలని వారికి సూచించారు. జిల్లాలో 5 వేల క్వారంటైన్ బెడ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరో 10 రోజులు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి.. తెల్లబోయిన నల్ల మీనం.. ఎగమతుల్లేక ఇక్కట్లు